బీజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఏజ్ పెంచాలనీ కోరుకుంటూ, ఒక బిల్లును తీసుకురావాలన్నారు. ఆ బిల్లుని మా పార్టీ తరుపున సపోర్ట్ ని మేము తీసుకువస్తున్నామని ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు.

"మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ప్రొఫెసెర్ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. కాని నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను అసెంబ్లీ లో చాలామంది సభ్యులు ఉస్మానియా గురించి మెడికల్ హాస్పటల్ గురించి మాట్లాడారు.  కానీ ఈ ఇవాళ మన గవర్నమెంట్ హాస్పటల్లో పేద ప్రజల పరిస్థి ఎలాగ ఉంది అని ముఖ్యమంత్రి వాళ్ళపైన కూడా కొంచెం దృష్టి ఉంచాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

అదే విధంగా ఉస్మానియా హాస్పటల్ ని ఇంకొకసారి ముఖ్యమంత్రి  చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది నా నియోజకవర్గంలోకే ఉంది. ఒకసారి ఉస్మానియాలోకి పేషెంట్ వెళ్తే ఆ పేషెంట్ బతికి బయటకు వస్తారో లేదో కూడా గ్యారెంటీ లేదని తెలియజేసిన రాజాసింగ్, ఆ పరిస్థితి ఇప్పుడు ఉస్మానియాలో క్రియేట్ అయినది. దానికోసం మేము కూడా 100 శాతం ప్రభుత్వానికి సహకరిస్తాము. 


"కానీ మా రిక్వస్ట్ ఎందంటే ఉస్మానియా లాగా, గాంధీ లాగా ప్రతి ఒక్క జిల్లాలో అట్లాంటి ఒక మోడల్ హాస్పటల్ కట్టాలని మేము మా పార్టీ తరుపున కూడా ముఖ్యమంత్రి కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా ఇవాళ పేద ప్రజలను కాపాడే బాధ్యత మనందరి పైన మరియు ముఖ్యమంత్రి  పైన ఉంటది.గవర్నమెంట్ హాస్పటల్స్ ని మరింత డెవలప్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను" అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: