2019 ఎన్నికల ఫలితాల మీద కోర్టుకి ఎక్కేవారి సంఖ్య బాగా పెరిగింది.ఇ వి.ఎం ల టాంపరింగ్ మీద ప్రతిపక్షాలు ఎన్నికల ముందు చేసిన హడావిడీ ఇప్పుడు కొంచం సద్దుమణిగినట్టే కనపడుతోంది. ఐతే తమ ఓటమి మీద అన్ని పార్టీల అభ్యర్థుల బుర్రల్లోనూ అంతులేనన్ని సందేహాలు లేకపొలేదు. అందుకే అమీ తుమీ తేల్చుకోడానికి ఏకంగా కోర్టులోనే సవాలు చేస్తున్నారు.

ప్రచారసమయాల్లో లేవనెత్తిన దుమారం రెచ్చగొట్టే అనేక అంశాలు ప్రకటనలు మనసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నది వాస్తవం.ఇప్పటికే కోర్టుల చుట్టూ ప్రదిక్షిణాలు చేస్తున్న రాహూల్ గాంధీ కి తోడుగా అమిత్ షా మీద కూడా పలురాష్ట్రాల్లో ఎన్నికల పిటీషన్లు వేస్తున్నారు.

ఇప్పటికే పెండింగ్ కేసుల సంఖ్య తో సతమతమవుతున్న కోర్టుల న్యాయమూర్తులు ఈ ఎన్నికల పిటీషన్లు పెద్ద తలనొప్పిగా మారాయి. మరి సాధ్యమైనంత త్వరగా వీటిని ఒక కొలిక్కి తేవాల్సిన అగత్యం కోర్టుల మీద పడింది. చూద్దాం యెంత వేగంగా కోర్టులవారు తీర్పులు చెపుతారో!


మరింత సమాచారం తెలుసుకోండి: