రాజకీయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, పైగా అందులో సంచలనాత్మక పథకాలు అవలీలగా ప్రకటించటం అంటే, ఈ తరంలో అది ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవచ్చు. ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండి జగన్ సంచలనాత్మక నిర్ణయాలతో ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు. ఇక డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అనుగుణంగా కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే రుణమాఫీ పొందటానికి డ్వాక్రా మహిళలకు ఈ అర్హతలు తప్పనిసరి.
నవరత్నాల పథకాలలో భాగంగా వైయస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాలుగు దశల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. డ్వాక్రా రుణ వివరాలు సేకరించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జిల్లాలో పొదుపు మహిళలు రుణం పొందిన సభ్యులు అప్పులు ఉన్న వారి వివరాలు పంపాలని, సర్ఫ్ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు తీవ్ర ఆదేశాలు అందాయి.
తొలుత ఈ నెల పదో తేదీ లోపు సమాచారం పంపాలని ఆదేశించారు. తాజాగా గడువు పెంచారు. ఇటీవల నిర్వహించిన వీడియో సమావేశంలో శనివారంలోగా సమాచారం ఇవ్వాలని కోరారు. దీంతో క్షేత్ర స్థాయి సిబ్బంది అన్ని సంఘాల అధ్యక్షులకు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ లు పంపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏప్రిల్ పదకొండువ తేదీ నాటికి స్వయం సహాయక సంఘాలకు చెందిన రుణాలు బ్యాంకులు లింకేజ్ ద్వారా రుణాలు పొంది ఇప్పటి వరకూ చెల్లించని వారి జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
అధికారులు ఒంగోలు చీరాల మార్కాపురం కందుకూరు గిద్దలూరు కనిగిరి చీమకుర్తి అద్దంకి పట్టణాల్లో మొత్తం తొమ్మిది వేల పొదుపు గ్రూపులు ఉండగా, వాటిలో ఐదు వేల ముప్పై మూడు గ్రూపులకు బ్యాంకుల ద్వారా పెట్టుబడి రుణాలు ఇచ్చినట్టు గుర్తించారు వారి నుంచి బ్యాంకు రుణాల సమాచారం చెల్లించకుండా ఉన్న బకాయిలు పొదుపు సంఘాలు ఎప్పటి నుంచి పని చేస్తున్నాయని సమాచారాన్ని పత్రాల రూపంలో సేకరించి ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళా సభ్యులే తిరిగి చెల్లిస్తే, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నగదు నేరుగా సంఘాల బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ విషయంపై డీఆర్ డీఏ పీడీ జి నరసింహులు మాట్లాడుతూ రుణం పొందిన సంఘాల వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించిందని దాంతో సంఘాల అప్పులు బ్యాంకుల వారీగా తేల్చేందుకు విచారణ చేపడుతున్నామన్నారు. బ్యాంకుల నుంచి రుణం పొందిన మహిళలు తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు అయితే రుణమాఫీకి, ఏప్రిల్ పదకొండువ తేదీకి ముందు రుణం తీసుకున్న డ్వాక్రా మహిళలకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రం లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల సభ్యులుగా ఉన్న మహిళల పేరిట 22,147 కోట్ల అప్పులున్నట్లు తేల్చారు.వడ్డీ భారం మహిళలపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం రుణంపై పథకం అమలు చేసే నాటికి 2,477 కోట్ల వడ్డీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ డబ్బులను ప్రభుత్వం మొదటి ఏడాదే బ్యాంకులకు చెల్లించాలనీ ఫైనల్ చేశారు. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చెందిన ఋణాలని, నాలుగు విడతల్లో రుణమాఫీ చేసి ఆ డబ్బును కూడా ఆయా సంఘాల మహిళలు చేతికే ఇస్తామని ప్రకటించారు.
ఈ పథకం అమలులో ఎవరికి ఏ అనుమానాలూ తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా వుండటానికి సంఘాల వారీగా అప్పుల వివరాలు అందరికీ తెలిసేలా ఆన్ లైన్ లో నమోదు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొత్తం రుణంపై మొదటి ఏడాదికయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి, రశీదులను గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేయాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: