బి.సి.సంక్షేమానికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బి.సి సమాజం రుణపడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రామరాజు పేర్కొన్నారు. మీడియా తో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్తగా కార్పొరేషన్ ల ఏర్పాటు సంక్షేమ పధకాల కోసం రాష్ట్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు.

ఆదరణ పధకం, బి.సి.స్టడీ సర్కిల్స్,బి.సి.గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు విద్యాభ్యాసం,బి.సి.కాలేజీ హస్టళ్ళ నిర్వహణ.ఎం.బి.సి.కార్పొరేషన్, బి.సి.కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బి.సి.లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులలో బి.సి.లకు 50 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని అయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర భట్రాజు సంఘం ఉపాధ్యక్షులు  చక్రాల ఫకీరు రాజు అధికార ప్రతినిధి కూరపాటి రాజా మాష్టారు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కొంతం ప్రసాద్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు భట్రాజు సంఘ నాయకులు. బి.సి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: