మాజీ స్పీకర్ కోడెల శిపప్రసాదరావు కుటుంబానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. వీటి కారణంగా ఆయన ప్రశాంతత కరవైన పరిస్థితి ఉంది.


ఇప్పుడు తాజాగా కోడెల కుటుంబానికి రావలసిన 4.5 కోట్ల రూపాయల వరకూ బిల్లులను ప్రభుత్వం నిలిపేసింది. కోడెల కుటుంబం చేసిన అక్రమాల కారణంగానే ఈ బిల్లులను నిలిపేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. పశువుల గడ్డి , మందుల సరఫరాలో సైతం టిడిపి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.


మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.... " టీడీపీ నేతలు దేనిని వదలకుండా అవినీతికి పాల్పడ్డారు. పశువులకు సరఫరా చేసే గడ్డిని కూడా వదలకుండా దోచుకున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పశువుల మందులు, గడ్డిలోనూ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు అన్నారు.


" మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్‌ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. అయిదు కంపెనీల కోసం అక్రమంగా టెండర్ల నిబంధనలు మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.4.5కోట్ల వరకూ వాళ్లకి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆదేశించాను. అయిదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టెండర్లు పిలుస్తాం.’ అని వెంకటరమణ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: