భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2 రాకెట్‌ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.  రాకెట్ లో చిన్నపాటి లోపం రావడంతో కొందరు విమర్శకులు ఇప్పుడు మళ్లీ gslv మార్క్ 3 రాకెట్ పనితీరు పై అనుమానంగా చూస్తున్నారు. రాకెట్ లో వాడే కీలకమైన క్రయోజెనిక్ ఇంజన్ పని తీరు పై బిన్నభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇస్రో కి బహు బలి గా పిలిచే లా ఈ రాకెట్ ను తయారు చేయడానికి దశాబ్దాల కాలం పట్టింది.  


ఈనెల 15వ తేదీ వేకువ జామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను నింగిలోకి పంపాల్సి ఉంది. అయితే రాకెట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. 56.24 నిమిషాల ముందు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1979 నుంచి రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సౌండ్ రాకెట్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 వరకు ఎదిగింది ఇస్రో. పి.ఎస్.ఎల్.వి రాకెట్ ఇస్రో కి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. 1993 నుంచి ఇప్పటి వరకు ఈ రాకెట్ స్వదేశీ, విదేశీ రాకెట్లను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్ళింది. ఈ రాకెట్ ద్వారా ఇప్పటి వరకు 48 ప్రయోగాలు జరగగా అందులో కేవలం రెండు మినహా మిగిలిన అన్ని ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. 


ఈ రాకెట్ కేవలం 2.5 టన్నుల లోపల బరువు వున్న ఉపగ్రహాలను మాత్రమే తీసుకెళ్లే సామర్ధ్యం మాత్రమే దీనికి వుంది. ఇస్రో కి క్రయోజెనిక్ ఇంజన్ తయారీ అంతా ఈజీ కాదు అన్నాయి ప్రపంచ దేశాలన్నీ. అయితే మనం gslv రాకెట్ లలో వరుస విజయాల్ని నమోదు చేసింది. చంద్రయాన్_ 2 ప్రాజెక్టు కు ఇస్రో 11 ఏళ్ల కిందట సిద్దం అయినప్పటికీ ఈ వుపగ్రహాలను మోసుకెళ్ళే gslv రాకెట్ లలో మనం పూర్తి పట్టు సాధించక పోవడంతో ఈ మిషన్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇస్రో అంతటితో ఆగకుండా gslv రాకెట్ లో అప్గ్రేడ్ గా gslv మార్క్ 3 రాకెట్ నీ రెడీ చేసింది. ఈ సాంకేతిక పరమైన లోపాన్ని పూర్తి స్థాయిలో సవరించి వారం రోజుల గడువులోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయడం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిదర్శనం.   



మరింత సమాచారం తెలుసుకోండి: