అసెంబ్లీలో మరోసారి రక్తం మరిగిపోయింది... ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. గతంలో ఓసారి చంద్రబాబు ఇదే మాట అన్నారు.. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం చూస్తుంటే రక్తం మరిగిపోతోంది..అన్నారు. కానీ.. రక్తం మరిగినా రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం మాత్రం ఏమీ లేకపోయింది.


ఇప్పుడు అసెంబ్లీలో మరోసారి రక్తం మరిగిపోయింది. ఈసారి మరిగింది చంద్రబాబు రక్తం కాదు.. అధికారపక్షం ఎమ్మెల్యే అంబటి రాంబాబుది. కానీ మరిగింది మాత్రం చంద్రబాబు గురించేనట.. చంద్రబాబు నాయుడు చట్టాలను గౌరవిస్తున్నామని చెబుతున్నప్పుడల్లా తన రక్తం మరుగుతోందని అంబటి రాంబాబు అంటున్నారు.


చట్టాన్ని ఉల్లంఘించి ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు చట్టం ఏమైందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అక్రమ కట్టడాలకు, వైఎస్ విగ్రహాలకు లింకు పెట్టి మాట్లాడతారా అని అంబటి ప్రశ్నించారు. రోజూ వైఎస్ విగ్రహం చూడడం ఇష్టం లేక విజయవాడ సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించిన చరిత్ర చంద్రబాబుది అని అంబటి గుర్తు చేశారు.


చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంది వాస్తవమేనన్న అంబటి.. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసి సహకరించాలని కోరారు. కంచె చేను మేయడం అంటే చంద్రబాబు అక్రమ ఇంటిలో ఉండడమేనని సామెత చెప్పుకొచ్చారు అంబటి. చంద్రబాబు గిల్లి కజ్జాలు పెట్టుకుని తనకు అవమానం జరుగుతోందని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని అంబటి విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: