కొన్నేళ్లుగా చంద్రబాబు కోటరీలో అసలైన రాజకీయ నాయకులు మాయమై.. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లయిన రాజకీయ నాయకులు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. సుజనా చౌదరి, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు, నారాయణ వంటి నేతలకు చంద్రబాబు ఎంత ప్రయారిటీ ఇచ్చారో తెలియంది కాదు.


ఆ మేరకు ఆ రాజకీయ నాయకులు కూడా చంద్రబాబుకు కష్టకాలంలో ఆదుకునే ఉంటారు. ఆ కృతజ్ఞతతో చంద్రబాబు అధికారంలోకి రాగానే వారికి అనేక రకాలుగా సాయపడ్డారు. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రాజెక్టులపై జగన్ సర్కారు వేసిన కమిటీ ధ్రువీకరిస్తోంది.


సీఎం రమేష్ కు చెందిన నిర్మాణ కంపెనీలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టినట్టు ఈ కమిటీ తేల్చిందట. సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్టు సంస్థకు 1600 కోట్ల రూపాయల విలువైన పనులు అప్పగించారని నిపుణుల కమిటీ పరిశీలనలో తేలిందట.


సీఎం రమేశ్ కు ఫేవర్ చేసేందుకు చంద్రబాబు సర్కారు 60–సీ నిబంధన కింద 268 పనుల నుంచి పాత కాంట్రాక్టర్లను తొలగించిందట. వాటిని రమేశ్ కంపెనీకి అప్పగించిందట. ఒక్క సంస్థకే ఇన్ని పనులు ఎందుకు అప్పగించారని ఈ కమిటీ హంద్రీ–నీవా, గాలేరు–నగరి అధికారులను ప్రశ్నించిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: