రాజ‌కీయాల్లో చేసే యుద్ధాలు ప్ర‌త్య‌ర్థి ప‌క్షంపైనే ఉండాలి త‌ప్ప‌.. స్వ‌ప‌క్షంపై కాద‌ని అంటారు రాజ‌కీయ పండితులు. కానీ, దీనికి విరుద్ధంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. త‌న సొంత పార్టీ నేత‌ల‌నే కామెంట్లు చేస్తూ.. వారినే టార్గెట్ చేస్తూ.. ట్వీ ట్ల యుద్ధం ప్రారంభించారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న తొలుత మాజీ మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి కేశినేని సొంత పార్టీ నాయ‌కుడే కాకుండా సొంత సామాజిక వ‌ర్గం నాయ‌కుడు కూడా అయిన ప్ప‌టికీ.. ఉమాపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఒక్క‌సారిగా సెంట‌రాఫ్‌ది టాక్ గా మారిపోయారు. 


ఇక‌, ఈ క్ర‌మంలోనే పార్టీపైనా ఆయ‌న దుందుడుకు ట్వీట్లు పెట్టారు. పార్టీలో త‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై అలిగిన నాని.. ట్వీట్ల ద్వారా పార్టీని ఇరుకున పెడుతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, విజ‌య‌వాడ‌కు చెందిన ఎమ్మెల్సీ, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు వెంక‌న్న కేంద్రంగా ట్వీట్ల యుద్దం ప్రారంబించారు కేశినేని. తీవ్ర‌స్థాయిలో ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డ్డారు. కొబ్బ‌రి చిప్ప‌ల దొంగ‌, సైకిల్ బెల్లుల దొంగ అంటూ.. నాని తీవ్రంగా వ్యాఖ్య‌లు సంధిం చారు. దీనికి బుద్దా వెంక‌న్న కూడా అదే రేంజ్‌లో రిప్ల‌యి ఇచ్చారు. 


అయితే, ఈ ట్వీట్ల యుద్ధం చిలికిచిలికి గాలివానగా మార‌డంతో బుద్దా త‌న ట్వీట్ల‌కు స్వ‌స్తి చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఇరువురు నాయ‌కుల మ‌ధ్య ఇక‌, ట్వీట్ల యుద్ధం స‌మ‌సిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా మ‌రోసారి కేశినేని నాని మ‌రో వివాదాస్ప‌ద ట్వీట్ పెట్టారు. ‘ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. నంబరు ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా, ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా, 88 ఏళ్ల కేశినేని నాని ట్రావెల్స్‌ మూసుకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకు ఊరందరూ దొంగల్లానే కనపడతారు’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నా రు. 


తాజాగా పెట్టిన ఈ ట్వీట్ నేరుగా బుద్ద వెంక‌న్న‌ను హ‌ర్ట్ చేసేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎలా దారితీస్తాయో చూడాలి. ఇదిలావుంటే, కేశినేని చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. టీడీపీలో త‌న‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని, ఓడిపోయిన నాయ‌కుల‌కే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఆయ‌న లోలోన ర‌గిలిపోతున్న మాట వాస్త‌వం. మ‌రోప‌క్క‌, ఆయ‌న‌తో బీజేపీ నాయ‌కులు ట‌చ్‌లో ఉన్నార‌నేదీ వాస్త‌వం. 


అయితే, దీనిని బ‌య‌ట‌కు చెప్ప‌లేక కేశినేని నాని స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇలా త‌న‌కు తానుగా పొగ‌బెట్టుకుని,  పార్టీలో వేటు వేయించుకుని బ‌య‌ట‌కు రావాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఏమేర‌కు నిజ‌మో.. చూడాలి. రాబోయే రోజుల్లో కేశినేని ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: