ఒక రాజకీయ పార్టీగా ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు ప్రజల ఆశీర్వాదాలు, తిరస్కరాలు రెండూ ఉంటాయి. రెండిటినీ సమానంగా తీసుకోవాల్సిన మెచ్యూరిటీ ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పెద్దలకు ఉండాలి. కానీ దీనికి భిన్నంగా, లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో  డీలా పడి  పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యారు. ముందుండి పార్టీని నడిపించే నాయకుడే సడన్ గా కాడి వదిలేస్తే పార్టీ పరిస్థితి ఏంటని ఆందోళన పడ్డారు. రాజీనామా పై రాహుల్ మనసు మార్చుకుంటారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజీనామా పై  వెనక్కి తగ్గేది లేదని రాహుల్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్ లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.


రాహుల్ కంటే ముందుగా, అస‌లు కాంగ్రెస్‌కు ఎందుకీ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తించే అంశం. గ‌త కొద్దికాలంగా, ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ కు మెయిన్ టార్గెట్ గా మారింది. ఈ పరిస్థితుల్లో  కాంగ్రెస్  ప్రజలకు దూరమవడం మొదలైందంటున్నారు సోషల్ సైంటిస్టులు.  పార్టీలోకి  కొత్త రిక్రూట్ మెంట్లు ఆగిపోయాయి. కాంగ్రెస్  ద్వారా అధికారానికి  చేరువైన కొన్ని  కుటుంబాలు మాత్రమే  పార్టీలో కొనసాగుతున్నాయి. అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి  ఈ కుటుంబాలు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాయి. చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో  సంపద పోగేసుకునే విద్య బాగా తెలిసిన బడా వ్యాపారస్తులు కాంగ్రెస్ లోకి  ఎంటరయ్యారు. ప్రజలతో సంబంధం లేకపోయినా డబ్బు చూపించి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు తెచ్చుకుంటున్నారు గెలుస్తున్నారు. కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను స‌హ‌జంగానే నూత‌న నాయ‌కుల‌కు దూరం చేశాయి. ఘోర ప‌రాజ‌యాన్ని అంట‌గ‌ట్టాయి.


ఇలాంటి త‌రుణంలో, రాహుల్ ముందున్న ప్ర‌త్యామ్నాయాలు ఏంటి? ఎందుకు రాహుల్ తిరిగి రాజ‌కీయం చేయాల‌నేది స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తించే అంశం. నెహ్రూ కుటుంబానికి చెందిన ఐదో తరం ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఒక బలమైన  ప్రతిపక్ష నాయకుడిగా నిరూపించుకోవాల్సిన టైం వచ్చిందంటున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ఒక్కటే నాయకుడి సమర్థతకు కొలమానం కాదంటున్నారు. అధికారపక్షం లోక్ సభలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే అప్పోజిషన్ పార్టీగా వ్యతిరేకించాల్సిన బాధ్యతను రాహుల్ తీసుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం 


మరింత సమాచారం తెలుసుకోండి: