అసెంబ్లీలో ఇపుడు చర్చలు ఓ విధంగా బాగానే జరుగుతున్నాయన్న భావన జనంలో ఉంది. ప్రతిపక్షానికి కూడా స్పీకర్ తమ్మినేని అవకాశం ఇస్తున్నారు. వైసీపీ సర్కార్ సైతం విపక్ష గొంతులను నొక్కమని గట్టిగా చెప్పీనందువల్ల వారికి మాట్లాడేందుకు అవకాశాలు బాగానే దొరుకుతున్నాయి. 


ఇక అధికారాపక్షమైతే చెప్పాల్సిన అవసరం లేదు. మైక్ అడిగిన వారికి కాదనకుండా తమ్మినేని ఇస్తున్నారు. కొత్త వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీలో మూగబోయిన ఓటుకు నోటుకు కేసు ఇపుడు మళ్ళీ మారుమోగుతోంది. తాజా అసెంబ్లీలో ప్రతీ రోజూ ఎవరో ఒకరు ఈ అంశం ప్రస్తావిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు  తీవ్ర  అసహనానికి గురి అవుతున్నారు.


ఇదిలా ఉండగా, గత టరమ్ లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావన చేయబోతే చాలు స్పీకర్  గా ఉన్న కోడెల శివప్రసాదరావు మైక్ స్విచ్ నొక్కేసేవారట.  ఇప్పుడు అదికారం పోవడంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆ అంశం గురించి ప్రస్తావించి విమర్శిస్తుంటే టిడిపి ఎమ్మెల్యేలు సమాదానం చెప్పలేకపోతున్నారని  ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అంటున్నారు. 


ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చారని బుగ్గన అన్నారు. మొత్తానికి ఇపుడు గత పాలనలో బాబు పాపాలను కడిగేసేందుకు అసెంబ్లీని బాగా వాడుకుంటున్నామని వైసీపీ నేతలు ఆనందంగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: