ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇపుడు అష్టకష్టాలు పడుతోంది. పూర్తిగా దోచేసిన ఖజానా వారసత్వంగా వచ్చిందని నిండు సభ సాక్షిగా ఆర్ధిమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూపాయి అప్పు పుట్టే ఏ అవకాశాన్ని వదలకుండా ఫుల్ గా వాడేసుకుంది.


ఇపుడు జగన్ కి అన్ని డోర్లు క్లోజ్ అవుతున్నాయి. అమరావతి రాజధాని కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని గతంలో ముందుకు వచ్చిన వరల్డ్ బ్యాంక్ ఇపుడు ఆ ప్రతిపాదనని వెనక్కు తీసుకుంది. కారణాలు ఏమీ చెప్పకుండా తన వెబ్ సైట్లో డ్రాప్ అవుతున్నట్లుగా పెట్టి వూరుకుంది.


అమరావతి రాజధాని విషయంలో అనేక అనుమానాలు ఉండడం, ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున రావడంతో పాటు, రాజకీయ కారణాల వల్ల కూడా వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిందని అంటున్నారు. మరి దీని వెనక టీడీపీ నేతలు ఉన్నారన్న అనుమానాలు కూడా వైసీపీ నేతలు వ్యక్తం చేయడం విశేషం. నిధులు ఎక్కడా పుట్టకుండా చేసి అభివ్రుధ్ధి జగన్ ఎలా చేస్తాడో చూస్తామన్న తీరులో తమ్ముళ్ళు ఉన్నారు. మరి జగన్ ఎలా ముందుకు వెళ్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: