రాజకీయ ప్రచార కర్త వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు మంచి పేరుంది.  ఈయన ప్రతి రాష్ట్రంలోనూ తన ప్రభావం చూపుతున్నారు.  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయన వ్యూహకర్తగా వ్యవహరించి ఆయా పార్టీల విజయంలో భాగస్వామ్యం అయ్యారు.  వెస్ట్ బెంగాల్ లో మమతా కోసం పనిచేయబోతున్నారు.  


ఇదిలా ఉంటె ఈ సంవత్సరం ఆఖరున మహారాష్ట్రకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈసారి శివసేన పార్టీ ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించి పూర్తిస్థాయిలో అధికారంలోకి రావాలని చూస్తోంది.  ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది.  


ప్రభుత్వంలో ఉన్నా ఇప్పటి వరకు థాకరే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరూ కూడా డైరెక్ట్ గా అధికారంలో ఉండలేదు.  మంత్రి పదవుల్లో చేయలేదు.  వెంకనుంచే అన్ని నడిపించారు.  ఇప్పుడు అలా కాకుండా థాకరే కుటుంబం డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది.  


అందుకోసం ప్రశాంత్ కిషోర్ సహాయాన్ని కోరింది.  ఇందుకు ఆయన కూడా ఒకే చేశారట.  ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా శివసేన యువనేత ఆదిత్య థాకరే ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.  వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. 

శివసేన ముంబైతో సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పట్టు ఉంది.  ఈసారి రాష్ట్రం మొత్తం పట్టు సాధించాలని చూస్తోంది.  వచ్చే ఎన్నికల తరువాత బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించి ముఖ్యమంత్రి పదవిని పొందాలని చూస్తున్నది.  ఇది బీజేపీకి మింగుడు పడని విషయమని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: