2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ప్రకటించారు.  దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించి రాజధానిని ఏర్పాటు చేయడానికి ప్లాన్ వేశారు.  ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది.  ప్రధాని మోడీతో సహా కెసిఆర్ కూడా హాజరయ్యారు.  


ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  ఇక రాజధాని ప్లాన్ కోసం సింగపూర్ నుంచి ప్రత్యేక టీమ్ వచ్చి ప్లాన్ సిద్ధం చేసింది.  చాలాసార్లు డిజైన్ మార్చారు.  డిజైన్ రెడీ కావడానికి ఏళ్ళు పట్టింది.  సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని బాబు కల.  రాజధాని నిర్మాణానికి సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంక్, ఏషియా డెవలప్ మెంట్ బ్యాంక్ రెడీ అన్నాయి. 


అధికారం మారింది.. ఇప్పుడు బాబు అధికారంలో లేరు.  జగన్ అధికారంలోకి వచ్చారు.  బాబుగారు సింగపూర్ అని అంటే.. అవేమి అవసరం లేదు.. ముందు పాలనపై దృష్టిపెట్టి ఆ తరువాత నిర్మాణాలపై దృష్టి పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు.  రాజధాని లేకుండా పాలన జరగడం కష్టం కదా.  


మరి జగన్ మనసులో ఎలాంటి రాజధానిని నిర్మించాలని అనుకుంటున్నాడో ఇప్పటి వరకు తెలియదు.  జగన్ ముందు చాలాసమస్యలు ఉన్నాయి.  అందులో ఈ రాజధాని సమస్య కూడా ఒకటి.  ఈ ఐదేళ్ళలో జగన్ రాజధానిని కంప్లీట్ చేయాలి.  పదేళ్ల తరువాత అంటే మరో ఐదేళ్ళలో ఉమ్మడి రాజధాని నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విడిపోతుంది.  కాబట్టి ఈ ఐదేళ్ళలో రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి.  మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: