గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఘోరంగా ఓటమిపాలైంది.  యూపీలో చాలా ఆశలు పెట్టుకుంది.  మహాకూటమి పేరుతో అక్కడ ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు పెట్టుకుంది.  కానీ, కాంగ్రెస్ పార్టీ రాయ్ బరేలి స్థానం మిన్నగా మరెక్కడా విజయం సాధించలేదు.  


కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ నియోజక వర్గంలో రాహుల్ గాంధీ ఓటమిపాలు కావడం విశేషం.  అయితే, రాయ్ బరేలిలో విజయం సాధించిన తరువాత సోనియా గాంధీ తరపున ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలుఅక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడికి వెళ్లారు.  


రాయ్ బరేలిలో పర్యటించిన ప్రియాంక గాంధీకి యూపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వం కల్పించిన భద్రత పట్ల ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.  


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం విశేషం.  తనకు కల్పించిన భద్రత పట్లచాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది.  కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇలా మాట్లాడటం యోగి సర్కారుకు మంచి శుభసూచికం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: