పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు.  వారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు.  గన్ పట్టి కదనరంగంలోకి దూకుతున్నారు.  ఎలాంటి రిస్క్ జాబ్ అయినా సరే రిస్క్ లేకుండా చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.  దేశం ఏదైనా కావొచ్చు... చేసే పనిలో ఏ మాత్రం తేడా ఉండదు.  


నేపాల్ దేశంలోని మహిళలు కూడా ఆర్మీలో జాయిన్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  అయితే, నేపాల్ లో ఆయుధ తయారీలో కేవలం నలుగురు మహిళలే పనిచేస్తున్నారు.  ఆర్మీకి సంబంధించిన ఉద్యోగమే అయినప్పటికీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది.  


అలాంటి రిస్క్ ను సైతం చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు ఆ నలుగురు.  ఈ నలుగురిలో లీలా కాపీలే అనే మహిళా మొదటగా తుపాకీ రిపేరింగ్ గారేజ్ లో చేరింది.  ఆయుధాలు రిపేరింగ్ చేసే కర్మాగారంలో చేసిన మొదటి మహిళగా ఉండటం చాలా బాగుందని చెప్పింది.  


ఆమె చేరిన తరువాత హిమా పోఖ్రాన్, అస్మితా ఆచార్య, కుస్ కుమారి థాపా లు జాయిన్ అయ్యారు.  ప్రస్తుతం ఈ నలుగురే ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ నలుగురి స్పూర్తితో మరికొంతమంది మహిళలు ఆయుధ రిపేరింగ్ సెంటర్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: