వెస్ట్ బెంగాల్ లు మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి.  గత ఎన్నికల్లో బీజేపీ అక్కడ 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించింది.  అప్పటి వరకు సాధ్యం కానీ దాన్ని మోడీ చేసి చూపించాడు.  బెంగాల్లోకి అడుగుపెట్టి 12 సీట్లు కైవసం చేసుకున్నారు.  


2014 పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకోవడం విశేషం.  ఇదిలా ఉంటె, 2019 వచ్చే సరికి బీజేపీ ఏకంగా 18 స్థానాలు గెలుచుకుంది.  ఇది మామూలు విషయం కాదు.  గ్రేట్ అనే చెప్పాలి.  బీజేపీ 18 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో మమతా బెనర్జీ షాక్ తిన్నది.  


ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది.  మమతా కోటాలో కాషాయం జెండా ఎగరాలని లక్ష్యంగా పెట్టుకుంది.  అందుకోసమే బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ.  ఇందులో భాగంగా మమతా బెనర్జీని మానసికంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ పావులు కడుపుతున్నది.  


మమతా పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని అక్కడి నాయకులు చెప్తున్నారు.  బీజేపీ నాయకులే కాకుండా.. ప్రధాని కూడా ఈ విషయాన్ని చెప్తుండటం మంటకు మింగుడు పడటంతో లేదు.  పైగా బెంగాల్ కు చెందిన టివి ఆర్టిస్టులు డజను మంది బీజేపీ తీర్ధంపుచ్చుకున్నారు .  ఒకేసారి మూకుమ్మడిగా బీజేపీలో చేరడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: