ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోయిన తరువాత సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న రచ్చ అంతా ఇంహతా కాదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందట. అమరావతిలో భూముల ధరలు దిగొస్తున్నాయట, విశాఖలో రియల్ పెట్టుబడులు తగ్గిపోయాయట, దీనికి జగనే కారణం అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది పచ్చ బ్యాచ్. అవును రియల్ ఎస్టేట్ పడిపోయింది. అయితే ఏంటి? పేదవాడికి వచ్చిన నష్టం ఏంటి? అమరావతిలో, విశాఖలో భూముల రేట్లు పడిపోతే పేదవాళ్లకి వచ్చిన ఇబ్బందేమీలేదు. ఒక రకంగా మధ్య తరగతికి మేలే జరిగింది అని చెప్పుకోవాలి.

రాజధాని పేరుతో వేలకు వేల ఎకరాలు బినామీ పేర్లతో కొనేసి, నివాస స్థలాలకు కృత్రిమ కొరత సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వేల కోట్లు ఆర్జించాలని చూశారు టీడీపీ నేతలు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఐదేళ్లలో వారి పాచిక పారేది. కానీ జగన్ అధికారంలోకి రావడంతో వారి అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రజావేదిక కూల్చివేతతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. భూముల విషయంలో రైతుల్ని మోసం చేసినవారు, సామాన్యుల నోటికాడ కూడు లాక్కున్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


వీరి ప్రోద్బలంతో వస్తోందే ఈ డూప్లికేట్ 'రియల్' ఉద్యమం. రియల్ ఎస్టేట్ మాఫియా, తెలుగుదేశం సపోర్ట్ తోటే ఇలా తప్పుడు రాతలు రాస్తోంది చంద్రబాబు అనుకూల మీడియా. భూముల రేట్లు తగ్గడం ఒక రకంగా శుభ పరిణామం. అవసరం ఉన్నవారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇలాంటి మార్పు కోసమే ఎదురుచూస్తారు. మరి అలాంటి వారికి లాభంచేకూరే విషయాన్ని ఇలా భూతద్ధంలో పెట్టిచూడటం ఎంతవరకు సబబు.

మరింత సమాచారం తెలుసుకోండి: