2019 ఎన్నికల ఫలితాలకు ముందు జనసేన పార్టీ కనీసం 5 నుండి పది సీట్లు గెలుస్తుందని అందరూ భావించారు. కానీ అంచనాలకు భిన్నంగా కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది జనసేన పార్టీ.పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుండి రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచారు. ఈ గెలిచిన ఎమ్మెల్యే వలనే ఇప్పుడు జనసేన పార్టీకి సమస్యలు మొదలయ్యాయి. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత హైదరాబాద్లోని జనసేన ఆఫీస్ నుండి సంక్షేమ పథకాలకు నిధులు బాగానే కేటాయించారని రాష్ట్ర ప్రగతిని మాత్రం విస్మరించారని జన సేన పార్టీ స్పందించింది. కానీ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాష్ట్ర బడ్జెట్ ను భారీగా పొగడటంతో జనసేన పార్టీ భవిష్యత్తులో వైసీపీని విమర్శించాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
 
అధికార పక్షమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిగారి పాలనను , రాష్ట్ర బడ్జెట్ ను, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108,104 ఆంబులెన్స్ లను రాపాక వరప్రసాద్ మెచ్చుకున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ నుండి అధికార పక్షాన్ని విమర్శించే అధికారం ఉన్న రాపాక వరప్రాసాద్ జగన్ ను అంత భారీగా పొగడటంతో భవిష్యత్తులోనైనా జగన్మోహన్ రెడ్డి గారిని రాపాక వర ప్రసాద్ విమర్శించే అవకాశమే లేనట్లు అర్థమవుతుంది. జనసేన పార్టీలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే వైసీపీని మెచ్చుకుంటూ ఉంటే ఎలా అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: