కేంద్ర సంస్థ అయిన కాగ్ చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక పథకాన్ని మెచ్చుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్) పనితీరుపై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు దీనిని ఓ అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించారు.


తాజాగా ఆర్టీజీఎస్‌పై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధికారులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్‌టైం గవర్నెన్స్‌ ఒక వినూత్న ప్రక్రియ అని కొనియాడారు. కాగ్‌ డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అండ్య్రూ డబ్ల్యూ.కె.లాంగ్‌స్టీ నేతృత్వంలో 17 మంది అధికారుల బృందం గురువారం అమరావతిలో పర్యటించింది. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని ఆర్టీజీఎస్‌ స్టేట్‌ కమాండ్‌ కేంద్రాన్ని సందర్శించింది.


ప్రజలకు రియల్‌టైంలో ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రభుత్వం అందజేస్తోన్న సేవలు, నవరత్నాల పథకాలను అమలులో సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరును సీఈవో బాబు వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డానికి టెక్నాల‌జీని స‌మ‌ర్థంగా వినియోగించుకుంటోంద‌ని ఆయన వివ‌రించారు. గ్రామ వాలంటీర్లు, స్పంద‌న, అమ్మఒడి, రైతు భ‌రోసా లాంటి ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డంలో టెక్నాల‌జీని స‌మ‌ర్థంగా వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: