పవన్ కళ్యాణ్ సినీ సీమలో ఎదురులేని సూపర్ స్టార్. ఆయన సినిమా చేసే బిజినేస్ వంద కోట్లు పై మాటే. తెలుగు సినిమాను ఓ మెట్టు ఎక్కించడంతో పవన్ పాత్రను మరువలేం. ఇక ఆయన చేసినవి పాతిక సినిమాలే అయినా అద్భుతమైన స్టార్ ఇమేజ్ ని  సొంతం చేసుకున్నారు.


ఇదిలా ఉండగా జనసేన పార్టీ పెట్టి  తాజా ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ దారుణంగా ఓడిపోయారు. ఆయన స్వయంగా రెండు చోట్ల సీట్లు కోల్పోయారు. ఇక పవన్ ఓడినా కూడా తాను రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే పార్టీకి ఫండ్ కావాలి. ఆ సమస్య అలా పట్టి పీడిస్తోంది. దాంతో ఇపుడు పవన్ ఫ్యాన్స్ తమ నాయకుని పార్టీని ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారుట.


వంద కోట్లతో కార్పస్ ఫండ్ జనసేనకు సమకూర్చాలని ఆలిండినా పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అయింది. పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. ఆ రోజు నాటికి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి వంద కోట్ల రూపాయలను జనసేనకూ అందించాలని నిర్ణయించారు. దీని మీద ఇపుడు ఫ్యాన్స్ అంతా పట్టుదలగా ఉన్నారు. ఆన్ లైన్ లో ఎవరికి తోచిన మొత్తాన్ని వాళ్ళు చెల్లించే విధంగా పవన్ ఫ్యాన్స్ ప్రొగ్రాం డిజైన్ చేసిందట. పవన్ బర్త్ డే కానుకగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి మంచి ప్రొగ్రాం  కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: