తెలంగాణలో ప్రతిపక్షం పార్టీ విషయంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ప్రతి పక్షంలో ఉందో ఇప్పుడు ప్రజలకు తెలియని పరిస్థితి. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా కావాలట! ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు విన్నవించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కు మిత్రపక్షంగా చలామణి అవుతున్న ఎంఐఎం అలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను అడుగుతూ ఉంది.


తెలంగాణ అసెంబ్లీలో ఎవరు ఏ పార్టీనో సామాన్యులకు అంతుబట్టదు. ఈ విషయం గురించి అసెంబ్లీ వెబ్ సైట్ ను పరిశీలిస్తే చిత్రమైన నంబర్లు కనిపిస్తాయి. ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అంశం గురించి అసెంబ్లీ సైట్లో ఈ రకమైన లెక్కలున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి వంద మంది ఎమ్మెల్యేలట. కాంగ్రెస్ పార్టీకి ఆరు మంది ఉన్నారట. తెలుగుదేశం పార్టీ  ఎమ్మెల్యేలు ఇద్దరని, బీజేపీ ఒకరని, ఒక సీటు ఖాళీగా ఉందని పేర్కొన్నారు.


ఇక ఎంఐఎం ఏడు మంది, ఏఐఎఫ్ బీ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు. నామినేటెడ్ ఒకరు. ఇలా సభలో టీఆర్ఎస్ తర్వాత ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఎంఐఎం ఖాతాలోనే ఉన్నారు. ఏడు మంది సభ్యులతో ఉంది ఆ పార్టీ. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతూ  ఉంది. అయితే కనీసం పదోవంతు సభ్యులు లేనిది ఏ పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అనుకుంటే ఇవ్వొచ్చనే వాదనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: