2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నారా లోకేశ్ అధికార పక్షాన్ని విమర్శించాల్సి వస్తే ట్విట్టర్ ద్వారా విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేశ్ విడతల వారీగా పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు ముఖ్యమైన భాద్యతలు అప్పగించాడు. 
 
నారా లోకేశ్ కు చంద్రబాబు నాయుడు టీడీపీ సోషల్ మీడియా విభాగ భాద్యతలు అప్పగించాడని సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో సోషల్ మీడియా కృషి ఎంతో ఉంది. సోషల్ మీడియా ద్వారా నవరత్నాలను ప్రచారం చేసి వైసీపీ లబ్ధి పొందింది. అందువలన 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుండే సోషల్ మీడియాలో అధికార పక్షాన్ని ఎదుర్కోవాలని టీడీపీ భావిస్తుందట. అందువలన ఈ భాద్యతలు చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు అప్పగించాడని సమాచారం. 
 
తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో చూసుకోవాల్సిన భాధ్యత కూడా నారా లోకేశ్ పై ఉంది. ప్రతిపక్షాలు నారా లోకేశ్ విషయంలో విమర్శలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం నారా లోకేశ్ కే భాద్యలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ భాద్యతలు ఒక్కొక్కటిగా చంద్రబాబు నారా లోకేశ్ కు అప్పగించబోతున్నాడని సమాచారం. మరి నారా లోకేశ్ ఈ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: