రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి. పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్టాలన్నీ తిరిగి తమిళనాడుకు చేరుకున్న 14 మందిలో పదిమందిని రోడ్డు ప్రమాదం రూపంలో  విధి కాటేసింది. అలాగే , మొక్కుబడులు తీర్చుకునేందుకు బయలుదేరిన కుటుంబాల్లోని 18 మంది లో ఆరుగురు మొక్కులు తీర్చకుండానే మళ్లీ తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు.  రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు ఘోరరోడ్డు ప్రమాదాలు మొత్తం 16 మందిని పొట్టన పెట్టుకున్నాయి.

కోయంబత్తూరు నుంచి చెన్నైకి 28 మంది ప్రయాణికులతో అమ్మీ బస్సు బయలుదేరింది. అలాగే చెంగల్పట్టు జిల్లా ఉత్తిరమేరురూ నుంచి ఈ రోడ్ జిల్లా కొంగేయం వైపు జార్ఖండ్ , తమిళనాడు రాష్ట్రలకు  చెందిన 14 మంది కూలీలతో  ఒక వేన్ బయలుదేరింది. విద్యత్ కాంట్రాక్టరు ధానేశ్వరం ఆదేశాల మేరకు ఈరోడ్ జిల్లా కాంగేయంలో విద్యుత్ స్తంభాలను , భారీ టవర్లను అమర్చేందుకు వీరంతా ప్రయాణమయ్యారు. అత్యంత వేగంతో పరుగులు తీస్తున్న ఈ రెండు వాహనాలు కల్లకరిచ్చి జిల్లా ఎంపోర్ట్ అనే ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ధాటికి వేన్ నుజ్జునుజ్జయిపోయింది.

అమ్మీ బస్సు ముందుభాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అమ్మీ బస్సు డ్రైవర్  రాజేంద్రన్, వేన్ డ్రైవర్ మనికఠన్, వేన్ లో ప్రయాణిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముకేందర్ ముంగియ(35) తో సహా మొత్తం 9 మంది వాహన శిథిలాల్లో నలిగిపోయారు. తీవ్రగాయాలకు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న తూత్తుకుడి జిల్లా కలెక్టర్  సుబ్రహ్మణ్యం, పోలీసులు వెంటనే ఘటనా స్తలానికి వెళ్ళి మృతుదేహాలను , క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణిస్తున్న వారిలో మరో 7 మంది చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: