దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కౌలు రైతుల సమస్యల పరిష్కారం దాదాపు ఒక కొలిక్కి వస్తున్నట్లే ఉంది. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ కారణంగానే వీళ్ళకు లబ్ది చేకూరే అవకాశం ఉంది.  అంటే ప్రభుత్వం అందచబోయే ప్రయోజనాలు ఇకనుండి కౌలు రైతులకు కూడా అందే అవకాశాలున్నాయి.

 

 

ఇంతకీ విషయం ఏమిటంటే,  ఇప్పటి వరకూ భూములపై బ్యాంకులిస్తున్న రుణాలన్నీ పట్టాదారు పాసుబుక్కల ఆధారంగానే ఇస్తున్న విషయం తెలిసిందే. పట్టదారు పాసుబుక్కులన్నీ భూ యజమానుల పేర్లపైనే ఉంటుంది. అంటే పాసుబుక్కల్లో ఎవరి పేర్లయితే ఉంటాయో వాళ్ళకే బ్యాంకులు కూడా అప్పులిస్తాయి.

 

నిజానికి భూములపై అప్పులు తీసుకునేది భూ యజమానులు, భూముల్లో పంటలు పండించేది మాత్రం కౌలు  రైతులు. అంటే ఇరవైనాలుగు గంటలూ పొలంలో  కష్టపడేది కౌలు రైతులైతే పొలాలపై అప్పులు తీసుకునేది మాత్రం భూ యజమానులు. ఎలాగూ పొలాన్ని కౌలుకు తీసుకున్నారు కాబట్టి విత్తనాలు, ఎరువులు తదితర పెట్టుబడులన్నీ కౌలు రైతులే భరిస్తున్నారు.

 

దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ సమస్యకు ఫులుస్టాప్ పెట్టాలని జగన్ నిర్ణయించారు. అందుకే భూ యజమానులకు-కౌలు రైతులకు మధ్య 11 నెలలకు ఓ ముసాయిదా అగ్రిమెంట్ ను ప్రభుత్వం రెడీ చేసింది. అసెంబ్లీలో బిల్లు పాసైతే ప్రభుత్వం అందించే రాయితీలు, లబ్ది భవిష్యత్తులో కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. భూ యజమానులకు, కౌలు రైతులకు ఆమోదయోధ్యంగా ముసాయిదీ రెడీ అయినట్లు సమాచారం. చూద్దాం బిల్లును ప్రవేశపెట్టినపుడు ఏ అంశాలో చర్చకు వస్తాయో.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: