అమరావతికి భారీ రుణం ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంకు వెనుకంజ వేసింది. రుణం ఇచ్చేందుకు నిరాకరించింది. చంద్రబాబు హయాంలోనే ఈ రుణ ప్రతిపాదన, తనిఖీలు జరగగా.. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికు దాన్ని జగన్ కు నెగిటివ్ గా ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.


ప్రపంచ బ్యాంక్ రాజధాని ప్రాజెక్టుకు రుణం ఇవ్వకోపవడాన్ని ఆంద్రజ్యోతి పత్రిక వైసిపి ప్రభుత్వానికి షాక్ అంటూ రాసుకొచ్చింది. ప్రభుత్వం మారడం వల్లే ప్రపంచ బ్యాంకు వెనుకంజ వేసింది అంటూ ప్రచారం మొదలు పెట్టింది. అయితే ప్రపంచ బ్యాంక్ రుణమంజూరుపై చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయని సాక్షిలో మరో కథనం వచ్చింది.


ఆ కథనం ప్రకారం.. ‘రాజధాని అమరావతి ప్రాజెక్ట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. స్థానిక ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ఇటువంటి ప్రాజెక్ట్‌లో మేం భాగస్వాములం కాలేం’ అని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పిందట.


మరి ఇదే నిజమైతే.. ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని కూడా జగన్ సర్కారు చేతగానితనంగా చేస్తున్నది కచ్చితంగా విష ప్రచారమే అవుతుంది. అయినా జగన్ సర్కారు వచ్చి రెండు నెలలు కూడా కాకపోయినా ఈ వైఫల్యాన్ని చంద్రబాబు ఫెయిల్యూర్ గా కాకుండా జగన్ ఫెయిల్యూర్ గా చిత్రీకరించే ఆంధ్రజ్యోతి నైపుణ్యాన్ని మెచ్చుకోవలసిందే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: