ఏపీ సీఎం జగన్ కు రాష్ట్రాన్ని పాలించడం చేతకావడం లేదట.. చేతికానితనంలో ఏపీని చీకిటిపాలు చేస్తున్నారట.. ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు ఇవి. టిడిపి వ్యూహ కమిటితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. వైసీపీ దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని చంద్రబాబు విమర్శించారు... ఆయన ఇంకా ఏమన్నారంటే...


“ రాజధానికి నిధుల మంజూరుకు ప్రపంచ బ్యాంకు వెనుకంజ వేసింది.. రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేత-లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు పట్టుబడతాం.. “ యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. పోలవరం,అమరావతి పనులు పూర్తిగా పడకేశాయి. అన్నిజిల్లాలలో అభివృద్ధి పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆగిన పనులు ప్రారంభించే సామర్ధ్యం వైసీపీకి లేదు. వైసీపీ పాలన పొరుగు రాష్ట్రాలకు పండుగ, ఏపికి దండగ గా మారింది. పాలనపై జగన్ కు అవగాహన లేదు, ప్రతిపక్షం చెబితే వినరు.”


" వైసీపీ నేతల చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్రనష్టం చేస్తున్నారు. పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయి. దాడులు-దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారు.శాంతిభద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు రావు, యువత ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.”


మరింత సమాచారం తెలుసుకోండి: