పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానం వస్తోంది. కేశినేని ట్వీట్లను భరించలేని టిడిపిలోని కొందరు నేతలు కేశినేని రాజీనామాను కోరుతున్నారు. అదికూడా ఎంపి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాతే లేండి. కొద్దిరోజులుగా విజయవాడ ఎంపి కేశినేని నాని-ఎంఎల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య ట్విట్లర్లో భీకరమైన ట్వీట్ల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. 

 

బుద్ధాకు కేశినేనికి మొదటి నుండి పడదు. మొన్నటి ఎన్నికల్లో  టిడిపి ఘోర పరాజయం పాలైన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రచ్చన్నంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కేశినేని తన ట్వీట్లలో బుద్ధాను మాత్రమే కాకుండా చంద్రబాబునాయుడును కూడా లాగారు. ఇక్కడే పార్టీలోని నేతలకు మండుతోంది.

తాను పార్టీలోనే ఉండాలని అనుకుంటే పెంపుడు కుక్క(బుద్ధా) ను అదుపులోకి పెట్టుకోమని ఏకంగా చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసుంటే పెద్ద మెజారిటితో గెలిచేవాడినంటూ చెప్పారు.

 

ఎప్పుడైతే కేశినేని అలా చెప్పారో లేదో వెంటనే నేతలందరూ మండిపోతున్నారు. నిజంగానే ఎంపికి అంత సీన్ ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ స్వంతంత్ర అభ్యర్ధిగా ఎన్నికలను ఫేస్ చేయాలంటూ చాలెంజ్ చేస్తున్నారు. నిజంగానే కేశినేని గనుక వాళ్ళ చాలెంజ్ ను స్వీకరిస్తే వెంటనే రాజీనామా చేసే అవకాశాలున్నట్లు నేతలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: