వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా అనుకుంటూ తిరుమలచేరి భక్తిపారవశ్యంతో ఉర్రూతలూగిస్తూ శ్రీవారినీ క్షణకాలం దర్శించుకోవడం మహాభాగ్యంగా ఉప్పొంగిపోతూ ఎంతగానో పరవశించి పోతారు సామాన్య భక్తులు. స్వామి వారి అనుగ్రహం పొందాలనే తపన ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు అందుకోవాలనే ఆరాటం ప్రతి భక్తుని మదిలోనూ ఉంటుంది.


కానీ ఆ పవిత్ర తిరుమల గిరుల్లో ఆ దేవదేవుని సన్నిధిలో సామాన్య భక్తులకు న్యాయం జరగడం లేదనే చెప్పాలి నిన్నటిదాకా సిఫార్సు లేఖలతో తప్ప మరి వేరే ఏ ఇతర దారిలో లభ్యంకాని విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్టు పేరుతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సన్నిధిలో భక్తులను L1 L2 L3 గా విభజించి ఒకరికి దర్శనం మరియు హారతి సౌకర్యం మరొకరికి వారి వారి బృందాల వారీగా దర్శనం మిగిలినవారికి స్వామివారిని అత్యంత సమీపంగా దర్శనం చేసుకుంటూ నడిచి వెళ్ళిపోయే సౌకర్యం కల్పించటం అనే పద్ధతులు ప్రవేశపెట్టారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కన్నా వీఐపీ ఎవరు? తిరుమలలో మహిళలు పువ్వులు పెట్టుకోరాదు అక్కడి పువ్వులని స్వామివారి సేవకే చెందాలని చెప్పే దేవస్థానం వారికి ఆ తిరుమలలో స్వామి వారే వీఐపీ అనే విషయం ఎందుకు తెలియదు?


ఇక భక్తి పారవశ్యంతో ఆ వెంకటేశ్వరస్వామి దర్శనార్ధమై తిరుమల చేరే భక్తుల కష్టాలు వివిధ విధాలుగా ఉంటాయి మొదటగా గది తీసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి తిరుమల చేరుకున్న వారికి గది తీసుకోవడానికి పట్టే సమయం చాలా ఎక్కువ అటుపై తలనీలాలు సమర్పించుటకు ఉండే లైను కూడా ఎక్కువే. ఎన్ని చోట్ల కష్టాలు పడిన చివరకు క్షణకాలం లభించే ఆ వేంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూప దర్శనంతో అంతా మర్చిపోయి అలౌకిక ఆనందంతో తదాత్మ్యం చెందే భక్తులు కోకొల్లలు.


నేడు రేపు నిన్నటి విఐపి బ్రేక్ విధానం మా రీ కొత్త పద్ధతి రాబోతుందనే ది వినికిడి. అది ఏ రకంగా ఉండబోతుందో ఆ వెంకటేశ్వర స్వామి వారికే ఎరుక  ఏది ఏమైనా సామాన్య భక్తుని గుండె చప్పుడు విని, ఆశీర్వదించే వానికి అందరూ ఒక్కటే అని తెలుసుకుని ఆ భగవంతుని దర్శనం రాజు పేద తేడా లేకుండా అందరికీ సమానంగా జరిగేటట్లు చూడటం ఆ దేవస్థానం వారి కనీస కర్తవ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: