ప్రాణాపాయ సమయంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని పునఃజన్మ  ప్రసాదించే ఆపద్బాంధవికి  పునర్ వైభవం రానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్  రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక అయినా 108 అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అత్యవసర పరిస్థితుల్లో  వైద్య సేవలందించి ప్రాణాలు నిలిపేందుకు వైఎస్సార్  108 ను ప్రవేశపెట్టారు. ఈ సేవల వల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఆ మహానీయుని మరణాంతరం 108 సేవలపై నీలినీడలు కమ్ముకున్నాయి.  

గత ఐదేళ్ల టీడీపీ పాలనలో 108 సేవలు  నిర్వీర్యమయ్యాయి. కాలం చెల్లిన వాహనాలు, అరకొర వసతులు , సిబ్బందికి వేతనవేదనల నడుమ ఫోన్ చేసిన గంటకు కూడా వాహనం రాని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ తనయునిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజారోగ్యం  కోసం రెండడుగులు ముందుకు వేసి 108 సేవలకు జీవ పోసారు . ఆపదలో ఉన్నవారు ఫోన్ చేసిన క్షణాల్లో 108 ఘటనా స్థలానికి వెళ్లేలా కసరత్తులు చేస్తున్నారు.  ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సైతం ప్రభుత్వం రూ.143.88 కోట్లు 108 సేవలకు కేటాయించినట్లు తెలిపారు.

108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్రంలో  అదనంగా అవసరమైయ్యే వాహనాలపై వైద్యరోగ్య  శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఉన్న వాహనాల్లో కండిషన్ లో లేని వాహనాల వివరాలు, అదనంగా కావాల్సిన 108 వాహనాల సంఖ్యకు సంభందించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో 108 వాహనం అందుబాటులో రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: