నేడు జరుగుతున్న తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో మున్సిపల్ బిల్లు చట్టం పైన చర్చ జరుగుతోంది.  ఈ సందర్బంగా ఎంఐఎం ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు లక్షల డబల్ బెడ్ రూమ్ ఇళ్లను జననాలకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది .

'కానీ ఇప్పుటి వరకు ఎన్ని ఇళ్లు కట్టారు ఏ స్టేజ్ లో ఉన్నాయి ఎప్పుడు అందచేస్తారు అన్న వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది.  అంతేకాకుండా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్.ఆర్.డీ.పీ  తీసేశారు దీని ద్వారా గత మూడు సంవత్సరాల్లో ఎస్.ఆర్.డీ.పీ కారిడర్ కి ఏ పనైతే ఇచ్చారో అవన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ' అన్నారు. 

అంతేగాక  "టోలీచౌకి లంగర్ హౌస్ మరియు రేతిబౌలి వరకు కారిడార్  శాంక్షన్ అయ్యింది ఫౌండెషన్ కూడా అయ్యింది కాని అది ఆగిపోయింది. రేపు రాబోయే మెట్రో రైళ్ల  దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలని మాట చెప్పేసి దానిని చేయకుండా  ఆపేశారు. ఏయిర్ పోర్టు నుంచి పి.ఎన్.ఆర్ ఎక్స్ప్రెస్ టోలీచౌకి వెళ్లాలి అంటే లేదా గచ్చిబౌలి చెరాలంటే వాళ్లు చివరి వరకూ సరోజిని  దగ్గర దిగి  మాసబ్టాంక్  దగ్గర యూటర్న్ తీస్కోని వీళ్లాల్సివస్తోంది దీని వల్ల  మెహదీపట్నం దగ్గర ట్రాఫిక్ పెరుగుతోంది.  ఇంత ట్రాఫిక్ లో వెళ్లాల్సిన అవసరం ఉండాలా?" అని ప్రశ్నిస్తున్నానని అన్నారు.

నేనిప్పటికీ రెండు మూడుసార్లు   ఈ ప్రభుత్వాన్ని  రిక్వెస్ట్ చేసిన రేతిబౌలి దగ్గర ఒకే ఎగ్జిట్ పెడితే ఇవి చాలా వరకు తగ్గుతాయని తెలిపాను అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: