దేశ మొత్తం ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తోందని ప్రస్తుతాని కి కర్ణాటక లో సంకీర్ణ ప్రభుత్వ మనుగడను నిర్దేశించే బలపరీక్ష కాసేపట్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ జేడీఎస్ సభ్యు లలో ఇప్పటికే విధానసభకు చేరుకొన్నారు రాత్రంతా సభలోనే గడిపిన బీజేపీ సభ్యు లు అక్కడే ఉండి తమ నిరసనను కొనసాగిస్తున్నారు సభ ప్రారంభం కాగానే బలపరీక్షకు పట్టుబట్టాలని బిజెపి నేత నిర్ణయించారు. ఇప్పటికే పదిహేను మంది సభ్యుల రాజీనామాతో మైనారిటీలో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికే మరిన్ని చిక్కులు వచ్చిపడుతున్నాయి.

తాజాగ కాంగ్రెస్ కు చెందిన మరో ఎమ్మెల్యే శ్రీమత్ పాటిల్ తాను అనారోగ్యం కారణంగా సభకు హాజరు  కాలేనంటు స్పీకర్ కు తెలియజేశారు. తమ పార్టీకే చెందిన శ్రీమత్ పాటిల్ ను బిజెపి కిడ్నాప్ చేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నా  సమయంలో శ్రీమత్ పాటిల్ వీడియో విడుదల చేశారు. వ్యక్తిగత పనుల కోసం ముంబై వెళ్లారని ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో హాస్పత్రి లో చేరినట్టు స్పీకర్ గా పంపిన వీడియో సందేశం విడుదల చేశారు. తాజా కారణాల వల్ల కాంగ్రెస్ బలం 101 కి తగ్గింది.


అయితే బలనిరూపణ అంశంలో గవర్నర్ వజుబాయ్ వల్ల జోక్యం చేసుకోడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కు సిద్ధమయ్యారు ఆయన రాజ్యాంగేతర శక్తి గా వ్యవహరిస్తూ బీజేపీకీ సాయం చేస్తున్నారనే కాంగ్రెస్ జెడిఎస్ నేతలు ఆరోపిస్తున్నారు విధానసభలో స్పీకర్ సుప్రీం అని సభా వ్యవహారాల్లో గవర్నర్ ఏమాత్రం జోక్యం చేసుకోలేరని కాంగ్రెస్ పక్ష నేత సిద్దా రామయ్య తేల్చి చెప్పారు


మరింత సమాచారం తెలుసుకోండి: