రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు సంబంధించి 2019-20 సంవత్సరానికి గాను   రూ.28,861 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించడం జరిగిందనీ ఇది చాలా గొప్ప పరిణామం ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్  రూ.2,27,074 కాగా  ఒక రైతాంగానికే రూ.28,861 కోట్లు కేటాయించడం శుభపరిణామం గా భావిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఇది రాష్ట్ర బడ్జెట్ లోనే 12.66 శాతం కేటాయించింది ఈ జగన్ ప్రభుత్వం అని ప్రసాద్ రాజు పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు అలాంటి వ్యవసాయ రంగానికీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రభుత్వం రైతు పక్ష  ప్రభుత్వ మని నిండు మనసుతో మరి ప్రకటించారు అని తెలిపారు. అలాంటి రైతు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్య మంత్రి రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని పేర్కొన్నారు.  వారి స్ఫూర్తి తో రైతుల సంక్షేమానికే ఈ ప్రభుత్వం అంకితమవుతూ నందుకు గర్వంగా ఉందని చెప్పారు.



 గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ దేశ చరిత్ర లో చంద్రబాబు ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఆయన పీటమెక్కిన ప్రతిసారి  వ్యవసాయ సంక్షోభమే చూస్తున్నామని గడచిన ఐదు సంవత్సరాలలో కరువులు, తుఫాన్ లు, వరదల గానీ చూస్తూనే ఉన్నామని చెప్పారు.   


2009-10 సంవత్సరం నాటికి ఆ రోజున ఈ రాష్ట్రం లో నలభై రెండు లక్షల హెక్టార్లు ఆయకట్టు తో పండిస్తే ఈ రోజు న పది సంవత్సరాల తరువాత ముప్పై ఐదు లక్షల అరవై వేల హెక్టార్లకే పడిపోయిందన్న విషయం పేర్కొన్నారు. అలానే రబీలో ముప్పై లక్షలు ఆనాడు ఉంటే రెండు వేల తొమ్మిది పదిలో ఈ రోజు న పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి వచ్చేటప్పటికీ ఇరవై లక్షల హెక్టార్లకే పడి పోయినటువంటి విషయం పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: