ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మందు బాబులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకొని చంద్రబాబు నాయుడుని వారి పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసే వైఎస్ జగన్ ఈసారి రాష్ట్రం మొత్తాన్ని షాక్ కి గురిచేశారు. ఏపీలో ఒక వైపు మద్యాన్ని నిషేదిస్తామంటూనే మరోవైపు ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. 


చిప్ లిక్కర్ నుంచి బ్రాండ్ మందు వరుకు అన్ని ప్రీమియం బ్రాండ్ ధరలు అక్టోబర్‌ 1 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వమే స్వయంగా మధ్య దుకాణాలను నిర్వహించనుందని దానికోసం విధివిధానాలు ఖరారు చెయ్యడానికి ఇప్పటీకే రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని సమాచారం. 


అయితే ఇలా భారీ ధరలు పెంపు కూడా మద్యం నిషేధించడానికి ఇదొక మార్గం అని అంటుంది ఏపీ ప్రభుత్వం. మద్యానికి అంత డబ్బు పెట్టలేక మందు బాబు లు వెనకడుగు వేస్తారని, ఇలా ఎక్కువ ఖర్చు అవుతే ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకుంటారు అని అంటే, కొందరు నెటిజన్లు మాత్రం 'ఇప్పటి వరుకు మందు బాబులు పని చేసిన డబ్బులో కొంచం మాత్రమే ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడు సంపాదించిందంతా ఆ మధ్యానికే తగలపెడుతారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: