నిన్నటి నుంచి ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయం ఇవ్వటం లేదని పచ్చ మీడియా జగన్ ప్రభుత్వం మీద విషం కక్కింది. అయితే ప్రపంచ బ్యాంకు ఇస్తామన్నది మనకు అప్పు మాత్రమే. అయితే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి అమరావతి నిర్మించాలి అనేది చంద్రబాబు నాయుడి ప్రణాళిక. అందుకే రైతులు, స్వచ్ఛంద సంస్థలు వరల్డ్ బ్యాంక్ కే ఫిర్యాదు చేశాయి. నగరీకరణకు అప్పులు ఇవ్వడంలో వరల్డ్ బ్యాంక్ కొన్ని నియమాలు పెట్టుకుంది. పచ్చని ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో ముక్కలు చెక్కలు చేయడానికి వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వదు.


అందుకే ఆ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని అప్పుకు నో చెప్పిందనేది ఒక వెర్షన్. మరో సంగతేమిటంటే.. అమరావతిలో ముందస్తు తనిఖీలు చేసి రుణం ఇవ్వాలని వరల్డ్ బ్యాంక్ అనుకుందట. అయితే అలాంటి తనిఖీలకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం ఏపీకి చెప్పిందట. అలా ముందస్తు తనిఖీలు తర్వాత అప్పు అనే పరిస్థితి వస్తే దేశంలోని అనేక ప్రాజెక్టులకు ఇబ్బంది ఏర్పడుతుందని కేంద్రం సూచించిందట.


అందుకే ఏపీ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ అధికారుల తనిఖీలకు అవకాశం ఇవ్వలేదని, దీంతోనే అప్పు నిలిచిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా నిలిచిపోయినది అభివృద్ధి కోసం అంటూ ఇస్తున్న ఉచిత నిధులు కాదు. వడ్డీలకు ఇచ్చే అప్పులు. అప్పుచేసి పప్పుకూడుతో ఎంతవరకూ లాభం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి అప్పు ఆగిపోవడం కూడా ఒకందుకు మేలేనేమో! ఈ విషయంలో జగన్ ప్రభుత్వం కూడా పెద్దగా ఫీలయ్యే అవకాశాలు కనిపించడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: