అసెంబ్లీలో స్పీకర్ గానీ ఎంఎల్ఏలు కానీ ఒకరి గురించి సంబోధించేటపుడు గౌరవనీయులైన సభ్యులు అని అంటుంటారు. కానీ నిజంగానే ఎంఎల్ఏలు అంతటి గౌవరానికి అర్హులేనా ? సభలో మాట్లాడేటపుడు విలువలు, సంప్రదాయాలను పాటిస్తున్నారా ? అంటే లేదనే చెప్పాలి.

 

ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గడచిన ఏడు రోజులుగా చూస్తుంటే ఓ విషయం అందరికీ స్పష్టంగా అర్ధమైపోతోంది. అదేమిటంటే తమపై జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే  వైసిపి సభ్యలు కానీ ఆరోపణలు చేస్తుంటే వాళ్ళ ఆరోపణలు జనాలు ఎవరికీ సక్రమంగా వినబడకుండా గోల చేస్తున్నారని.

 

ప్రతిపక్షంలో ప్రధానంగా మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నుండి గెలిచిన కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారం లక్ష్మణరేఖ కూడా దాటేశారు. జగన్ మాట్లాడుతున్నంతసేపు, లేకపోతే మంత్రులు సమాధానం చెబుతున్నంతసేపు సభలో రన్నింగ్ కామెంటరీ ఇస్తూనే ఉంటారు. సహజంగానే పెద్ద గొంతు కాబట్టి మైకుతో కూడా అవసరం రావటం లేదు అచ్చెన్నకు.

 

రన్నింగ్ కామెంటరీ వద్దని జగన్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు చెప్పినా చివరకు స్పీకర్ ఎన్నిసార్లు కూర్చోమని చెప్పినా కూడా అచ్చెన్న వినటం లేదు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమిటంటే కావాలనే అచ్చెన్న సభలో గోల చేస్తున్నారు. నిజానికి గడచిన ఐదేళ్ళల్లో అసెంబ్లీలో మాట్లేడేందుకు వైసిపి సభ్యులకు టిడిపి అవకాశమే ఇవ్వలేదు. అలాంటిది ఇపుడు వైసిపి నిబంధనలకు మించి మాట్లాడే అవకాశం ఇస్తున్నా ఇలా గోలచేసి సాధించేదేమిటో అచ్చెన్నకే తెలియాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: