తనకు  పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తానని చెప్పిన  నేనే వద్దన్నానని , అందుకే ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు చేసే ప్రయత్నం లో కాంగ్రెస్ అధిష్టానం ఉందని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు . మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరనున్నట్లు తేల్చి చెప్పారు . తాను బిజెపిలో చేరాక కాంగ్రెసోళ్లందరూ కమలం గూటికి చేరుతారని జోస్యం చెప్పారు .


బిజెపి లోకి టీఆరెస్ ఎమ్మెల్యే తీసువెళ్లేందుకు ..తాను  ఎవరితో మాట్లాడటం లేదన్న ఆయన , రాష్ట్రం లో టీఆరెస్ కు బిజెపినే ప్రత్యామ్నాయమని అన్నారు . కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపిలోకి వెళుతున్నారంటే టీఆరెస్ భయపడుతుందని అన్నారు . తనలాంటి వాడు  పార్టీలో చేరితేనే బీజేపీ బలపడుతుందని , త్వరలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని చెప్పారు . తాను  బీజేపీలో చేరినా ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయనని అన్నారు . ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్ అయిన మెడిసన్ అంటూ అపహాస్యం చేశారు . కాంగ్రెస్ మునిగే పడవ .. అన్న రాజగోపాల్ రెడ్డి , టైటానిక్ ఓడలో తన  లాంటి హీరో ఉన్నా మునిగిపోవాల్సిందేనని చెప్పారు .


 రెండు రోజులపాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాజగోపాల్ రెడ్డి , కాంగ్రెస్ సభ్యులకు దూరంగా ఒంటరిగా కూర్చున్నారు . త్వరలోనే తాను బీజేపీ లో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు, తానొక్కడే కాదని తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరుతారని బాంబు పేల్చారు . ఇప్పటి వరకు వెంకట్ రెడ్డి తాను కాంగ్రెస్ వీడేది లేదని పేర్కొంటూ వస్తున్నారు . రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: