కర్ణాటక రాజకీయం రోజు రోజుకి మలుపు తిరుగుతూ కాక రేపుతుంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత వరుసగా ఇది మూడవ విశ్వాసపరీక్ష కావడం గమనార్హం. మొదటిసారి సీఎం ఎడ్యూరప్ప తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రోజులు ముందు రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. తాజాగా ప్రభుత్వంలోని 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధం అవడంతో నేడు కర్ణాటక రాజకీయం హిట్ ఎక్కింది.


కర్ణాటక విధాన సౌధలో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది.ప్రతిపక్ష నేత బి.ఎస్.యడ్యూరప్ప ఈ రోజే విశ్వాస పరీక్షను పూర్తి చేయాలని స్పీకర్ రమేష్ ను డిమాండ్ చేయడంతో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. టీవీ తో రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసేందుకు రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ ని కోరగా…. స్పీకర్ ఈ విషయమై అడ్వకేట్ జనరల్ సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ప్రకటించడంతో ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.దీనితో సభ మూడు సార్లు వాయిదా పడింది చివరికి స్పీకర్  న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో,డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేశారు.


విశ్వాస పరీక్ష ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు మాజీ సీఎం జగదీష్ శెట్టర్ నేతృత్వంలో గవర్నర్ వాజుభాయ్ వాలా ను కలుసుకున్నారు.ముఖ్యమంత్రి పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే విశ్వాస పరీక్ష జరిపి స్పీకర్ రమేష్ కుమార్ ను ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. కాగా, కర్ణాటక రాజకీయం ఇంక ఉత్కంఠ వీడలేదు. చర్చ పూర్తయిన తర్వాతే బలపరీక్ష జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.


బలాబలాలు :
ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు 68 , జెడిఎస్ 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరు  సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిజెపికి ఇద్దరు స్వతంత్ర అ ఎమ్మెల్యేలు బలం ఉండడంతో వీరి సంఖ్య వల్ల 107 కి చేరిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: