మున్సిపల్‌ వ్యవస్థను అవినీతి రహితం చేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పట్టణాల్లో 75 చదరపు గజాల వరకు పేదల ఇళ్లకు పర్మిషన్లు అక్కర్లేదన్నారు. పట్టణాల్లో జీ ప్లస్‌ వన్‌ ఇళ్ల నిర్మాణానికి పరిష్మన్లు అక్కర్లేదని,  ప్రాపర్టీ టాక్స్‌ సంవత్సరానికి రూ.100 మాత్రమేనని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు . రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1 మాత్రమేనన్నారు. మున్సిపాలిటీల్లో అన్ని పర్మిషన్లు పారదర్శకంగా ఉంటాయని కేసీఆర్ అన్నారు .


ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవని, . మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు మాత్రమే ఉంటాయన్నారు. కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పిస్తున్నట్టు కేసీఆర్‌ తెలిపారు . తెలంగాణ అసెంబ్లీ నూతన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించింది . త్వరలోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించున్న నేపధ్యం లో తీసుకువచ్చిన ఈ చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది . హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్ లు ఆఫ్ గ్రేడ్ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించించింది .


కేవలం ఆస్తిపన్ను , రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి, ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నారన్న వారి విమర్శలను తిప్పి కొట్టేవిధంగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు . ఇక అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్ చట్టం అవినీతి ని పారదోలుతుందని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు . ప్రజలకు మేలు చేసేలా నూతన మున్సిపల్  చట్టం ఉందని , దీనితో రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు సేవలు పారదర్శకంగా అందుతాయని అన్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: