నేడు జరుగుతున్న  అసెంబ్లీ సమావేశాల్లో   కేసీఆర్   పల్లే మరియు పట్టణాల అభివృద్ది కి పెద్ద పీట వేసారు.  మూడు వేల నూట నలభై కోట్ల గ్రామాలకు కేటాయిస్తామన్నారు, అలానే ఆయిదు వందలు జనాభా ఉన్న గ్రామాని కి కూడా కనీసం ఐదు లక్షల రూపాయలు తగ్గకుండా నిధులు వస్తాయని కొన్ని పెద్ద గ్రామాలకు కోట్లలో కూడా రవచ్చు అని  అటువంటి గ్రామాలు కూడా తెలంగాణలో ఉన్నాయని కేసీఅర్  వ్యాఖ్యానించారు. 


అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 14 వ గ్రాంట్ కమీషన్ ద్వారా వచ్చే వెయ్యి ముప్పై కోట్లకి ఇంకొక్క వెయ్యి ముప్పై కోట్ల జతచేసి ఒక సవరణ తీసుకున్నామని ఈ మూడూ కలిపి ఐదు వేల కోట్ల వరకు ఈ పల్లె మరియు పట్టణాల కు  కేటాయించాలని కేసీఆర్   సభలో చెప్పారు.  స్థానిక  పంచాయతీ మరియు మున్సిపాలిటికీ వచ్చే  వార్షిక ఆదాయం కాకుండా వాటికి ఇది జతచేసి ఇస్తామని చెప్పారు. 


వచ్చిన మొత్తం ఆదాయాన్ని మరియు వాటికి వచ్చిన వార్షిక ఆదాయాన్ని  ఎలా ఉపయోగించాలన్నది ముందు ముందు డిపార్ట్మెంట్ వాళ్లకీ ఆదేశాలూ జారీ చేస్తామని  కేసీఅర్  నేడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: