ఏపీ అసెంబ్లీని చూసినపుడు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అసెంబ్లీలో 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జగన్ ప్రతిపక్ష నాయకుడు. ఇపుడు అటునుంచి  ఇటు వైపు సీట్లు మార్చుకున్నారు. కానీ ఇద్దరి మద్య‌న ఆదే మాటల యుధ్ధం అలాగే సాగుతోంది. అప్పట్లో జగన్ నోరు బయటకు వినిపించకుండా చేసిన ఘనత నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ది అయితే ఇపుడు బాబు వాయిస్ ని బాగా వినపడేలా చేస్తున్న ఖ్యాతి   మాత్రం ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం అని చెప్పుకోవాలి.


ఇదిలా ఉండగా బాబు జగన్ ఇద్దరూ ఇపుడు ఒకే రకమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. ఈ ఇద్దరు నేతలూ కూడా అసెంబ్లీలో ఒంటరి పోరాటమే చేస్తున్నారనుకోవాలి. ఒకరిద్దరు నేతలు తప్ప అటు నుంచి, ఇటు నుంచి కూడా వీరిని సహకారం లభించడంలేదు. బడ్జెట్ సమావేశాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. విపక్ష  నేత చంద్రబాబుకు అండగా అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి ఉంటే జగన్ కి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ వంటి వారు  మాత్రమే క‌నిపిస్తున్నారు. మిగిలిన మంత్రులతో సహా అంతా నోటికి తాళం వేసుకున్న వారే.


కొన్ని సందర్బాల్లో అంబటి రాంబాబు వంటి వారు నోరు చేసుకున్నా ఆర్కే రోజా, భూమన కరుణాకరరెడ్డి వంటి వారు పెదవి విప్పితే ఒట్టు. ఇక మంత్రులు పేరుకు పాతిక మంది ఉన్నారు. అందులో అయిదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, కానీ సభలో అర్ధవంతమైన చర్చలలో ఎవరూ చురుకుగా పాలుపంచుకోవడంలేదు. ఇక బాబుకూ అదే రకమైన పరిస్థితి. ఆయన వైపు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపుగా అందరూ సైలెంట్ అయిపోయారు. మొత్తానికి చూసుకుంటే అసెంబ్లీ ఎందుకు పెట్టారంటే జగన్, బాబు షో కోసమా అన్న భావన వ్యక్తం అవుతోంది. ప్రతీ దానికి అటు బాబు, ఇటు జగన్ లేచి మాట్లాడడమే జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: