ఏపీలో అత్యంత దారుణంగా ఓట‌మిని చ‌వి చూసిన టీడీపీలో కీల‌క నేత‌లు జంప్ చేస్తున్నారు. రెండో సారి కూడా అధికా రంలోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అన్ని సామాజిక వ‌ర్గాల‌ను మంచి చేసుకునే వ్య‌వ‌హారాల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ప్ర‌జ‌లు మాత్రం అన్నీ తీసుకుని, బాబును మాత్రం బుట్టదాఖ‌లు చేశారు. దీంతో టీడీపీ విప‌క్షానికే ప‌రిమిత‌మైంది. అయితే, ప్ర‌జాస్వామ్యంలో గెలుపు, ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. పార్టీలు మాత్రం నాయ‌కుల‌ను నిల‌బెట్టుకోవ‌డం, ప్ర‌తిప‌క్షం పాత్ర‌ను పూర్తిగా నిర్వ‌హించ‌డం అనేవి కీల‌కం. ఈ విష‌యంలో మాత్రం టీడీపీ చ‌తికిల ప‌డుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 


టీడీపీ ఓట‌మి త‌ర్వాత కీల‌క నాయ‌కులు, ముఖ్యంగా చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్ వంటి నేత‌లు కూడా జంప్ చేసేశారు. అయితే.. వీరిని ఆపేందుకుకానీ, ఇప్పుడున్న నాయ‌కుల్లో ఆత్మ‌స్థ‌యిర్యం నింపేందుకుకానీ.. చంద్ర‌బాబు ఎక్క‌డా ఎలాం టి ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు మ‌రో నెల రోజుల్లో అంటే.. వ‌చ్చే ఆగ‌స్టులో టీడీపీ నుంచి భారీ ఎత్తు న జంపింగులు ఉంటాయ‌ని అంటున్నారు. ఆప‌రేష‌న్ ఆగ‌స్టు పేరుతో బీజేపీ ఇప్ప‌టికే ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన కీల‌క టీడీపీ నాయ‌కులు వ‌రుస పెట్టి పార్టీ మారేందుకురెడీ అవుతున్నార‌ని స‌మాచారం. 


ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా త‌న దారి తాను చూసుకునేం దుకురెడీ అయ్యారు. అదేసమ‌యంలో కాపు నేత‌లు కూడా పార్టీకి బై చెప్పేందుకు రెడీగా ఉన్నారు. రెండు రోజుల కింద‌ట అసెంబ్లీలో కాపుల రిజ‌ర్వేష‌న్ అంశం త‌ర్వాత‌.. టీడీపీకి చెందిన కాపు నేత‌లు ఒక‌రిద్ద‌రు.. ఇంకా ఈ పార్టీలోనే ఎందుకు ఉన్నామా? అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చ‌ర్చ సంద‌ర్భంగా కాపుల‌ను బాబు మోసం చేశార‌ని, రిజ‌ర్వేష‌న్ విష‌యంలో సాధ్యం కాద‌ని తెలిసి కూడా వారిని రాజ‌కీయంగా వాడుకునేందుకు మ‌భ్య పెట్టార‌ని, కేంద్రం ఇచ్చిన ఈ డ‌బ్ల్యు ఎస్ ప‌థ‌కం ఒక కులానికి మాత్ర‌మే కాద‌ని, 


ఈ క్ర‌మంలోనే కాపుల‌కు బాబు కేటాయించిన 5% ఈడ‌బ్ల్యుఎస్ కోటా చెల్ల‌ద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. దీంతో కాపుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఉన్న న‌మ్మ‌కం బాగా స‌డ‌లిపోయింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే కాపు నాయ‌కులు ఎవ‌రికి వారుగా చ‌ర్య‌లు తీసుకుని, పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తేనే బెట‌ర‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబు మాత్రం మౌనంగా ఉన్నారు. త‌న‌కేమీ తెలియ‌న‌ట్టుగా, త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: