పండగ అయిన, ఫంక్షన్ అయిన,భాద అయిన,సంతోషం అయిన వెంటనే గుర్తొచ్చేది "మద్యం".మద్యాన్ని సరదాగా తాగేవాళ్ళు తక్కుమంది ఉంటే వ్యసనంగా మారి,బానిసలుగా అయిన వారు చాలా మంది.కేవలం మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు అనేకం.ఎలక్షన్స్ కి ముందు మద్యాన్ని నిషేధిస్తాం అని హామీ ఇచ్చారు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఇప్పుడు అది నిజం చేయడానికి అడుగులు వేస్తున్నారు.అయితే వెంటనే మధ్యాన్ని వెంటనే నిషేదించకుండా విడతల వారీగా నిషేధిస్తాం అని ప్రభుత్వం చెప్పింది. ఇదిలా ఉండగానే మరోవైపు లిక్కర్ ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
చీప్ లిక్కర్ నుండి హై క్లాస్ బ్రాండ్ వరకు అల్ ప్రీమియం బ్రాండ్ ధరలు ఆక్టోబర్ 1 నుండి మోతమోగానున్నాయి. ఇప్పటివరకు ఐఎంఎల్ డిపో ద్వారా అందిస్తున్న ప్రతి బ్రాండ్ మద్యానికి క్వార్టర్ కు కనీసం రూ50కి పైగా పెంచనున్నారు.
బార్ లకు మాత్రం 2022 మార్చ్ 31 వరకు ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు.
అప్పట్లో ఎన్ టీ రామారావు గారు కూడా ఏపీ లో మద్యాన్ని నిషేధించారు.మళ్ళీ దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్ సరిపోవడం లేదని మద్యం వాడకాన్ని మళ్ళీ అమలుపరిచారు.మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేయాలి అనే ఉద్దేశ్యం తో మద్యాన్ని నిషేధిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: