పోలింగ్‌ అనంతరం జగన్‌ సైలెంట్‌గా ఉండటానికి కారణం , తన టీమ్‌తో, తమ పాలనలో ఎలాంటి అధికారులు ఉండాలో ప్లానింగ్‌ చేసుకున్నారు. తదనుగుణంగానే, ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి, వై.ఎస్‌.జగన్‌ ఇతర రాష్ట్రాల్లోని చురుకైన అధికారులను డిప్యూటేషన్‌ పై తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

కేసీఆర్‌ తో సమావేశమైనప్పుడు.. తెలంగాణ క్యాడర్‌లో ఉన్న స్టీఫెన్‌ రవీంద్ర, శ్రీలక్ష్మిలను ఎపీకి పంపాలని అడిగారు. దానికి కేసీఆర్‌ కూడా ఓకే అన్నారు కానీ, కేంద్రం మాత్రం సాంకేతిక కారణాల వల్ల అడ్డుపుల్ల వేసింది.ఇప్పటి వరకు వారి ఫైళ్లలో పురోగతి లేదు.

ఈ నేపథ్యంలో వారిని ఏపీకి బదిలీ చేయించడానికి విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రయత్నిస్తున్నారని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. వీరి జాబితాలోకి ఇపుడు రోహిణి సింధూరి కూడా చేరారు. కర్ణాటక కేడర్‌కు చెందిన రోహిణి సింధూరి అనే అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న విషయం మీకు తెలిసిందే , ఆమె నెల్లూరులో పుట్టారు. తెలంగాణకు చెందిన , సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న సుధీర్‌ రెడ్డి ని వివాహం చేసుకున్నారు. ఆమెకు చురుకైన ఆఫీసర్‌గా గుర్తింపు ఉంది.

వై.ఎస్‌. జగన్‌ ఈ యువ అధికారులను డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకు రావడానికి ప్రయత్నించడం వెనుక అసలు కారణం పాలనలో వేగం పెంచి, మ్యానిఫెస్టోలోని నవరత్నాలను అమలు చేయాలనే తపనతోనే ఇదంతా చేస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. తన మంత్రి వర్గంలో దాదాపు యువరక్తం కావడంతో వారితో సమస్వయం అయి , పాలన కుంటు పడకుండా , అధికారులు కూడా సత్వర నిర్ణయాలు తీసుకుంటూ డైనమిక్‌గా పనిచేస్తారని జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: