ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు.  ముంబాయిలో భారీ వర్షాల నుంచి జనాలు ఇంకా కోలుకోనేలేదు. తాజాగా బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. అస్సాంలో వర్షాలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.   భారీ వర్షాలు బీహార్‌ ను ముంచెత్తుతున్నాయి. నేపాల్‌లో వర్షాలు కురుస్తుండటంతో దాని ప్రభావం బీహార్‌ రాష్ట్రం పై చూపింది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా బీహార్‌ లో కురుస్తున్న వర్షాలకు 78 మంది మృతి చెందారు. బీహార్‌ లోని సీతామర్హిలో అత్యధికంగా 18 మంది మృతి చెందారు.


మధుబానిలో 14 మంది, అరేరియాలో 12 మంది, షియోహార్‌, దార్భాంగాలో తొమ్మిది మంది, పూర్నియాలో ఏడుగురు, కిషన్‌ గంజ్‌లో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, తూర్పు చంపారన్‌లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 26 NDRF సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. నేపాల్‌లో వర్షాల కారణంగా అక్కడి వరద నీరు భారీ స్థాయిలో బీహార్‌లోని లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటోందని అధికారులు తెలిపారు.


దీంతో రాష్ట్రంలోని 6 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలోని 6 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: