ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి, వారిని సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా విజ్ఞానాన్ని అందించాలి.  ఒకప్పుడు విద్యా వ్యవస్థలో ఎంతో నిబద్దత కనిపించేది..కానీ ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునేవారు..కొంతమంది కీచక ఉపాధ్యాయుల వల్ల ఉపాధ్యాయ వృత్తికే కలంకం వస్తుంది.

ఈ మద్య ఓ హెడ్ మాస్టర్ మంచంపై కూర్చొని విద్యార్థులను చితకబాదడం చూశాం..తాజాగా  విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం రంగపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్ణచంద్రరావు అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. ఆయన పూర్తిగా మద్యానికి భానిసై..ప్రతిరోజూ స్కూల్ కిరావడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది.

ఆయన ప్రవర్తనతో విసిగివేసారిపోయిన రంగపల్లి గ్రామస్తులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద తమ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న పూర్ణచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రంగంలోకి దిగిన విద్యాశాఖ ఉన్నతాధికారులు తాగుబోతు టీచర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో వీలైనంత త్వరగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: