ఈరోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఏ రోజు సరిగ్గా 50 సంవత్సరాల క్రితం మన దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులు జాతీయం గావించబడ్డాయి. ప్రజల కష్టార్జితమును రక్షించడానికి అప్పటి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం బ్యాంకుల జాతీయకరణ.


1960వ దశకంలో దేశం చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నది తీవ్రమైన కరువు ఆర్థిక ఇబ్బందులు మరియు పలు రాష్ట్రాలలో అధికార పార్టీ అయినా కాంగ్రెస్ ఈ నేపథ్యంలో, శ్రీ మొరార్జీ దేశాయి లాంటి వారు వ్యతిరేకిస్తున్నప్పటికీ అప్పటి గౌరవ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి తీసుకున్న సంచలన నిర్ణయం ఈ బ్యాంకుల జాతీయకరణ.


ఆరోజు జాతీయం చేయబడిన బ్యాంకుల వివరాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిమిటెడ్
బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిటెడ్
యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్
కెనరా బ్యాంక్ లిమిటెడ్
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
సిండికేట్ బ్యాంక్ లిమిటెడ్
దేనా బ్యాంక్ లిమిటెడ్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
అలహాబాద్ బ్యాంక్ లిమిటెడ్
ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లిమిటెడ్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్


ఆరోజున ఈ 14 బ్యాంకుల యొక్క మొత్తము శాఖలు 8200 లుపెయిడప్క్యాపిటల్ 28.6 కోట్లుగా ఉంటే రిజర్వు ఫండ్ 38.57 కోట్లు డిపాజిట్ 2741.75 కోట్లు ఉంటే పెట్టుబడులు 781.64 కోట్లు మొత్తము రుణాలు 170 3.66 కోట్లు మొత్తము సిబ్బంది 93 వేల మంది మాత్రమే. అదే ఈ రోజున ఆ 14 బ్యాంకులను చూస్తే 90 వేల 765 శాఖలతో 127 లక్షల కోట్ల డిపాజిట్లతో 85 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: