తెలుగుదేశం పార్టీ నేతలు ట్విట్టర్ కే అంకితం అని నెటిజన్లు తేగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి తెలుగు దేశం నేత ట్విట్టర్ లో ఉంటున్నారని అంటున్నారు నెటిజన్లు. బాధ వచ్చిన, సంతోషం వచ్చిన, ఒకరిని పొగడాలన్నా, విమర్శించాలన్నా ట్విట్టర్ లోనే చేస్తున్నారని, ప్రజల వైపు కన్ను ఎత్తి కూడా చూడటం లేదని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 


ఈ ట్రోల్స్ కి నారా లోకేష్ ట్విట్లు ఒక కారణం అయితే కేశినేని నాని, బుద్ధా వెంకన్న మరో కారణం. నారా లోకేష్ పార్టీని అధికారంలోకి తీసుకురడానికి వైసీపీ నేతలు చేసే తప్పులను ఆయుధాలుగా చేసుకొని ట్విట్టర్ లో వదులుతుంటే, కేశినేని నాని, బుద్ధా వెంకన్న మాత్రం పార్టీ పరువు తియ్యడానికి గత ఆదివారం ట్విట్ల యుద్ధం చేసుకొని ఒకరి తప్పు ఒకరు బయట పెట్టారు.

కాగా చంద్రబాబు నాయుడు నుంచి నారా లోకేష్ వరుకు ప్రతి ఒకరు ట్విట్టర్ ఉపయోగించి పాలక పక్షం చేసే తప్పులను బయట పెట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ట్విట్లు చేసి నెటిజన్ల చేత 'తెలుగుదేశం పార్టీ నేతలు 'ట్విట్టర్'కే అంకితం' అంటూ కామెంట్లు చేయించుకుంటున్నారు. మరి ఈ కామెంట్లు చూసి అయినా తెలుగు దేశం పార్టీ నేతలు ట్విట్లు ఆపుతారేమో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: