కరీంనగర్‌ జిల్లాలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన గొర్రెల పంపిణీపై విచారణ జరిపించాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌) డిమాండ్‌ చేసింది.
ఇటీవల సచివాలయంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినతిపత్రం అందచేస్తూ, కరీంనగర్‌ జిల్లాలో బడ్జెట్‌ లేకుండానే సుమారు 600 యూనిట్ల గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్టు లెక్కలు చూపుతున్నారని పేర్కొన్నారు.

పంపిణీ జరిగిన యూనిట్లలో అధిక భాగం గొర్రెలను పంపిణీ చేయకుండా ఒక్కొక్క యూనిట్‌కు లబ్దిదారుని వాటాగా కొంత ముట్టచెప్పి,మిలిగిన మొత్తాన్ని అధికారులు, మధ్య దళారీలు నొక్కేయాలని చూస్తున్నారని .వారు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్ధితి రాష్ట్ర వ్యావ్తంగా ఉన్నట్టు ఇటీవల ప్రధాన పత్రికలలో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో , 
తెలంగాణ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల , అవినీతి, అక్రమాలు చోటు చేసుకొని, కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని ఒక సంస్ధ ఆరోపిస్తోంది. గొర్రెల పంపిణీ పథకంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 'వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్‌' అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ది సహకార సమాఖ్య ఎండీ తో పాటు సీబీఐని ఆదేశించింది. కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: