ప్రపంచంలో అమ్మ అనే పదానికి ప్రత్యేక నిర్వచనం చెప్పేవారు ఉండరు..ఎందుకంటే నవమాసాలు మోసి ఎన్నో కష్టాలు పడి బిడ్డకు జన్మనిస్తుంది.  మొదట మనం చూసేది అమ్మనే అందుకే చచ్చేవరకు అమ్మ గుర్తుంటుందని అంటారు.  అమ్మ మనకు జన్మనిస్తే ఆ జన్మనకు సార్థకత చేకూర్చేది నాన్న. మనిషి పుట్టినప్పటి నుంచి ఎదిగి తనకాళ్లపై తాను నిలబడే వరకు...అమ్మాయి అయితే పెళ్లి..ఆ తర్వాత కూడా ఆడబిడ్డగా ఎన్నో మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాద్యత తండ్రిదే.  ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నా బిడ్డకు తండ్రేగా.

ప్రేమ, వాత్సల్యం, మమకారం ఎక్కడికి పోతాయి. తల్లి జన్మనిస్తే తండ్రి జీవితాన్నిస్తాడంటారు.  తాజాగా  ఓ కంపెనీలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఈ సీఈఓ తన బిడ్డకు జీవితాన్నిస్తూ నెటిజన్ల మనసు గెల్చుకున్నారు. ఢిల్లీకి సమీపాన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న నొయిడా నగరానికి చెందిన అశుతోష్‌ హర్బోలా ‘బుజోకా’ అనే మార్కెటింగ్‌ కంపెనీ సీఈఓ.  ఒక కంపెనీకి పెద్ద హోదాలో ఉన్న తన కుటుంబం..తన కూతురు విషయంలో అంతే బాధ్యతగా ఉంటారట.  తన కార్యాలయం గదిలోనే తన చిట్టి తల్లికి అశుతోష్‌ పాలు పట్టిస్తుండగా ఆయన సహచరుడు దుష్యంత్‌సింగ్‌ ఫొటో తీసి ట్విట్టర్‌లో ఉంచారు.

‘మా సీఈఓ అశుతోష్‌ను ఓసారి చూడండి. నిజమైన తండ్రిగా ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో నిబద్ధతతో వ్యవహరించే అశుతోష్‌ తన బిడ్డ విషయంలోనూ అదే నిబద్ధత కనబర్చి నిజమైన తండ్రి ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. హ్యాట్సాఫ్ టు  హిమ్‌’ అంటూ వ్యాఖ్య ఉంచారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ చిన్నారికి అమ్మను మరిపించాడని..అంత మంచి తండ్రి ఆ చిన్నారికి ఉండటం అదృష్టమని అంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: